కొద్ది సేపటి ఆ పని కోసం సమంతకు ఎంత చెల్లిస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Prasanna |   ( Updated:2023-08-26 09:31:20.0  )
కొద్ది సేపటి ఆ పని కోసం సమంతకు ఎంత చెల్లిస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ,వెబ్ డెస్క్: సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ సమంత. శాకుంతలం ఫ్లాప్ కాగానే ఇక సమంత పని అయిపోయిందని, ఆమెపై ఎవరిష్టమొచ్చినట్టు వారు ట్రోలింగ్ చేసారు. ఇలాంటి వారికి గట్టిగా ఇచ్చి పడేసింది. భారత్‎లోనే కాకుండా అగ్ర రాజ్యంలోనూ సమంత క్రేజ్‎ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ఒక్కసారి స్టేజ్ మీద కనిపిస్తే చాలు అనుకున్న అభిమానుల లిస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సమంత గురించి ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. అమెరికాలో జరిగిన ఖుషి ఈవెంట్‌ సమంత స్టేజ్ మీద కనిపించింది కొన్ని నిమిషాలే అయినా, ఈవెంట్ మేకర్స్ భారీ మొత్తంలో ఈ ముద్దుగుమ్మకు చెల్లించుకున్నారట. ఇదే క్రమంలో శుక్రవారం న్యూయార్క్‌ సిటీలో ఖుషి ప్రమోషన్ ఈవెంట్‎ను నిర్వహించారు. ఈ ఈవెంట్‎లో సామ్ స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచింది. ఈమె కొద్దిసేపు మాత్రమే అక్కడ సందడి చేసింది. దానికి, ఈవెంట్ నిర్వాహకులు అక్షరాల రూ.30 లక్షల వరకు చెల్లించినట్లు టాక్ నడుస్తుంది.

Read More: అతడు మిస్టర్ పర్ఫెక్ట్.. అలాంటి వాడు కాదు.. విజయ్‌పై సమంత వైరల్ కామెంట్స్

మా లైఫ్‌లో అత్యంత సంతోషకరమైన మూడు రోజులు అవే.. విక్కీ

Advertisement

Next Story