- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR ‘దేవర’లోని టాప్ సీక్రేట్ బయటపెట్టిన హీరోయిన్.. షాక్‌లో చిత్రబృందం
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘దేవర’. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజైన టీజర్స్, పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తోన్న మరాఠీ బ్యూటీ శ్రుతి టాప్ సీక్రెట్ బయటపెట్టారు. ఈ చిత్రంలో తాను ‘దేవర’ భార్యగా నటిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే, ఈ చిత్రంలో డ్యూయల్ రోల్‌లో చేస్తున్న ఎన్టీఆర్‌కు ఒక పాత్రలో భార్యగా నటిస్తున్నట్లు చెప్పడంతో అటు దర్శకుడు, ఇటు ప్రొడ్యూసర్ షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు యువ సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.