తన సక్సెస్ మంత్ర ఏంటో చెప్పేసిన స్టార్ హీరోయిన్

by sudharani |   ( Updated:2024-07-03 16:07:00.0  )
తన సక్సెస్ మంత్ర ఏంటో చెప్పేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రకుల్‌తో పాటు సిద్ధార్థ్, కాజల్, ఎస్‌జే సూర్య లాంటి స్టార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూను.. సినిమా, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికవ విషయాలు పంచుకుంది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘అమేజింగ్ ప్లేయర్ విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా ఇష్టం’ అని తెలిపింది. అలాగే.. తన సక్సెస్ మంత్ర గురించి చెప్తూ.. ‘నేను కేవలం నా జీవితం, జాబ్, అభిమానులపైన మాత్రమే ఫోకస్ పెడతాను. ముఖ్యంగా నెగిటివిటీస్‌కు దూరంగా ఉంటాను. ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అస్సలు పట్టించుకోను. అలాగే నా పరిమితిలో నేను ఉంటాను. అదే నా బలం’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

సమంత, నాగచైతన్య విడాకులకు కారణం చిరంజీవి నేనా? ఇన్ని రోజులకు బయటపడ్డ షాకింగ్ నిజం!

Advertisement

Next Story