ఆ హీరోయిన్ అంటే క్రష్.. నాగచైతన్య కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-03 06:44:45.0  )
ఆ హీరోయిన్ అంటే క్రష్.. నాగచైతన్య కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో నాగచైతన్య ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మీ సీక్రెట్ క్రష్ ఎవరు? అని యాంకర్ అడిగాడు. దానికి చైతూ సమాధానమిస్తూ..‘‘ఈ మధ్య ‘బాబిలోన్’ అనే ఇంగ్లీష్ సినిమా చూశాను. ఇందులో యాక్ట్ చేసిన మార్గట్ రాబీ ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యాను. ప్రస్తుతానికైతే ఆమెపై చాలా అంటే చాలా క్రష్ ఉంది’’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగచైతన్య చేసి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

Read more:

Agent Movie OTT Release Date : ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ అయ్యేది అందులోనే.?

Advertisement

Next Story