మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే జీవితంలో సంతోషం.. కల్యాణ్ దేవ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-07-03 05:26:54.0  )
మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే జీవితంలో సంతోషం.. కల్యాణ్ దేవ్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కల్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకుని మెగా అల్లుడిగా ఫ్యాన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘విజేత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే శ్రీజ, కల్యాణ్ దేవ్‌లకు నవిష్క అనే పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారని కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా వీటిపై అటు మెగా ఫ్యామిలీ, కల్యాణ్ దేవ్ అధికారికంగా స్పందించలేదు.

అయితే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కు కల్యాణ్ దేవ్ హాజరుకాలేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ విడిపోయారని అందరూ భావించారు. కాగా, కల్యాణ్ దేవ్ సోషల్ యాక్టీవ్‌గా ఉంటూ తన కూతురితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నాడు. తాజాగా, మెగా అల్లుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర నోట్ రాసుకొచ్చాడు. ‘‘ మన జీవితంలో మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. మనకు అత్యంత మధుర క్షణాలు. దీనితో మీరు ఏకీభవిస్తారా?’’ అంటూరాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కల్యాణ్ దేవ్ శ్రీజను ఉద్దేశించే అలా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Click Here for Kalyaan Dhev Instagram post

Also Read: విడాకులే కాలేదు.. నిహారిక పై రెండో పెళ్లి రూమర్స్.. చేసుకోబోయేది ఆయాననేనట!?

Advertisement

Next Story