- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్లు అర్జున్, ప్రభాస్‌పై హన్సిక షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ హన్సిక నటించిన తాజా చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాదులో విలేకరులతో ముచ్చటించిన ఆమె.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘మనం ఇప్పటి వరకు అమ్మాయిలు, చిన్నపిల్లల అక్రమ రవాణాల గురించే విన్నాం. కానీ ఈ చిత్రంలో మనుషుల చర్మం అక్రమ రవాణా అనే ఒక కొత్త క్రైమ్‌ను చూపించబోతున్నాం. దర్శకుడు శ్రీనివాస్ తొలిసారి ఈ కథ వినిపించినప్పుడు ఇలాంటి క్రైమ్ కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాను. మా అమ్మ డెర్మటాలజిస్ట్ కావడంతో వెంటనే తనని స్కిన్ మాఫియా ఉందా అని అడిగాను. ఆమె ఎక్కడో ఇలాంటి క్రైమ్ జరిగినట్లు చదివానని చెప్పింది. ఇక ఈ మూవీలో నా పాత్ర చాలా బాగుంటుంది. నేను యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి అనే ఒక యువతిగా నటించాను. ఆమె ఒక పోరాట యోధురాలు. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అలాంటి ఆమెకు ఒక భయంకరమైన అధిగమించలేని సమస్య ఎదురవుతుంది. స్కిన్ మాఫియా ట్రాప్‌లో చిక్కుకుంటుంది. మరి దాని నుంచి శృతి ఎలా బయటపడింది? అన్నది అసలు కథ. ఊహించని ట్విస్టులతో ఉన్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇక నా 20ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడు దేని గురించి బాధపడలేదు. అవకాశాలు ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ ఒకేలాగా ఉంటాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. ఇక నా కెరీర్ ఆరంభంలోనే అల్లు అర్జున్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌లతో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.