ఇంట్లో నా మాట చెల్లదు.. ఆమె చెప్పిందే ఫైనల్.. షారుఖ్ ఖాన్

by samatah |   ( Updated:2022-05-28 12:01:47.0  )
ఇంట్లో నా మాట చెల్లదు.. ఆమె చెప్పిందే ఫైనల్.. షారుఖ్ ఖాన్
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే.కాగా తన డిజైన్ ఫిలాసఫీ, ప్రత్యేకతల గురించి తాజాగా ఓ సమావేశంలో వివరించిన గౌరీ.. బిజినెస్ విషయంలో షారుఖ్ తన వంతు సాయం చేస్తాడని చెప్పింది. ఈ మేరకు తమ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు తమతో కలిసి షారుఖ్ పనిచేశాడని తెలిపింది. అలాగే తన భర్త ఇంటీరియర్‌ డిజైన్‌ల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాడన్న ఆమె.. రంగులు, పైకప్పు, ఫ్లోరింగ్ వంటి డిజైన్స్ తీర్చిదిద్దడంలో ఆయన సృజనాత్మక బాగుంటుందని పొగిడేసింది. ఇక వీలైనప్పుడల్లా తన పనిలో భాగమయ్యేందుకు ఆసక్తి చూపిస్తాడన్న గౌరీ.. ముంబైలోని తమ నివాసంలో చేసిన ఇంటీరియర్ డిజైన్ మరపురాని ప్రాజెక్ట్‌ అని చెప్పింది. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో గౌరీని అద్భుతమైన డిజైనర్‌గా పేర్కొన్న షారుఖ్.. ఇంట్లో కొనుగోలు చేసే వస్తువులన్నీ ఆమె ఇష్టప్రకారమే జరుగుతుందని, ఆ విషయంలో అంతరాయం కలిగించడానికి తనకు అనుమతి లేదంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed