భార్యపై భర్త జోకులు వేయొద్దా.. రణ్‌బీర్‌కు మద్దతుగా గౌహర్ ఖాన్

by Naresh |   ( Updated:2022-08-26 13:07:43.0  )
భార్యపై భర్త జోకులు వేయొద్దా.. రణ్‌బీర్‌కు మద్దతుగా గౌహర్ ఖాన్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ గౌహర్ ఖాన్ భార్యలపై భర్తలు వేస్తున్న కుళ్లు జోకులకు సపోర్టుగా నిలిచింది. ఇటీవల అలియా భట్‌పై రణ్‌బీర్ వేసిన వెటకారపు జోక్ వివాదాస్పదమవడంతో తాను స్పందించాల్సి వచ్చిందన్న నటి హీరోకు పూర్తి మద్దతు తెలిపింది. ఈ మేరకు 'హల్కా ఫుల్కా మజాక్'లకు కూడా మనుషులు హర్ట్ అవడం కాస్త ఆందోళన కలిగించే అంశంగానే భావిస్తున్నానన్న ఆమె.. కొంతమంది జనాలు తేలికపాటి పదాలను కూడా కాంట్రవర్సీ చేసేందుకు పోటీపడటాన్ని చూసి సిగ్గు పడుతున్నట్లు పేర్కొంది. 'ఈ రోజుల్లో మనుషులు కాస్త సెన్సిటివ్‌గా మారిపోయారు. కట్టుకున్న భార్యతో చిన్నగా జోక్ చేయడాన్ని కూడా బ్యాన్ చేస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. టేక్ యే చిల్ పిల్ యార్. లైట్ తీసుకోండి. ఇది ప్రపంచంలోని చాలా సమస్యలను పరిష్కరిస్తుంది' అంటూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక గర్భవతి అయిన అలియాను ఉద్దేశిస్తూ వేసిన జోక్‌పై భారీ ఎత్తున్న విమర్శలు రావడంతో రణ్‌బీర్ క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : నా భార్యకు మానవత్వం లేదు.. కూతురిని తలచుకుని కుమిలిపోతున్న అమీర్

Advertisement

Next Story