- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravi Teja: మిస్టర్ బచ్చన్‌లో గబ్బర్ సింగ్.. సునామీ లాంటి అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా పరిచయం కాబోతుండగా.. విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన సితార్ పాట సంచలనం సృష్టించింది. ఇందులోని డాన్స్ స్టెప్స్ పలు విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈ పాట ఎక్కువ వ్యూస్, లైక్స్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేసింది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, హరీష్ శంకర్, జగపతి బాబు మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది. డబ్బింగ్ చెప్తున్న జగపతి బాబు రవితేజను బచ్చన్ అంటున్నావ్ మరి విలన్ గబ్బర్ సింగ్ కదా అది నువ్వా నేనా.. అని అడగ్గా.. దానికి మీరే అని చెప్తాడు. దానికి నటుడు డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు చెబుతాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. అలాగే మాస్ మహారాజా ఫ్యాన్స్ రెడీగా ఉండండి. సునామీ లాంటి అప్‌డేట్ అనౌన్స్‌మెంట్ ఉందని రాసుకొచ్చారు.
(Video Link Credits to peoplemediafactory Instagram Channel)