మాజీ సీఎం నల్లారితో బాలయ్య Unstoppable ముచ్చట్లు...

by S Gopi |   ( Updated:2022-11-22 11:29:16.0  )
మాజీ సీఎం నల్లారితో బాలయ్య Unstoppable ముచ్చట్లు...
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ హిట్ టాక్ షో 'అన్ స్టాపబుల్2 విత్ ఎన్ బీకే' లో ఈవారం రాబోయే అతిథులను ఆహా ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డిలు అతిథులుగా హాజరుకానున్నారు. అయితే, ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుందంటా. ఈనెల 18 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందంటా. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది.


అయితే, ఈ ముగ్గురు కూడా నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. సురేష్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు క్లాస్ మెట్స్ కాగా, బాలకృష్ణ వీరి కంటే ఒక సంవత్సరం సీనియర్. అయినా కూడా వీళ్లు ముగ్గురు కలిసి మెలిసి ఉండేవారంటా. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ చాలా క్లోజ్ గా ఉండేవారంటా. పాత ఫ్రెండ్స్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఎలా ఉండబోతుందో చూడాలంటే ఈనెల 18 వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story