జగన్ వ్యాఖ్యలకు హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు.. ఇచ్చిపడేసాడుగా

by Dishafeatures1 |
జగన్ వ్యాఖ్యలకు హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు.. ఇచ్చిపడేసాడుగా
X

దిశ, సినిమా: స్మాల్ స్క్రీన్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ఎంట్రీ తర్వాత ఫేమస్ అయిండు. తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆది అదే లెవల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌కు దూరమైన ఆది ప్రజెంట్ టెలివిజన్ షోలలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్‌గా ఉన్నాడు. ఓ వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూనే మరోవైపు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు.

ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గానూ ప్రచారంలో పాల్గొంటూ హైపర్ ఆది తన వ్యాఖ్యలతో షాక్ ఇస్తున్నాడు. మాటకు మాట సమాధానం చెబుతున్నాడు.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన మాట్లాడిన హైపర్ ఆది అవును ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి కానీ, ఫ్యాన్ నాలుగు లోనో, ఐదులోనో ఉండాలని హైపర్ ఆది అదిరిపోయే పంచ్ లు వేశారు.

అంతేకాదు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని జగన్ అడుగుతున్నారని, వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు చెల్లెళ్లకు అన్యాయం జరిగిందని, వాళ్ళ ఇంట్లోనే మంచి చేయలేని వాళ్ళు మీ ఇంట్లో ఏం చేస్తారంటూ హైపర్ ఆది జనాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవడానికి అందరూ గుంపుగా వస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్న హైపర్ ఆది, ఇంట్లో దొంగ పడితే, దొంగను తరమడానికి నలుగురు కలిసి వెళ్తారని, ఇక రాష్ట్రంలో గజ దొంగలు పడితే వారందరిని తరమడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది కాబట్టే, చెడును తరిమికొట్టడానికి మంచి వాళ్లంతా కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసారని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపుతున్నాయి.

Next Story

Most Viewed