ఫస్ట్ అడ్వెంచర్ ‘సుబ్రమణ్య’ మూవీ గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-09-15 15:05:01.0  )
ఫస్ట్ అడ్వెంచర్ ‘సుబ్రమణ్య’ మూవీ గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పాపులర్ నటుడు, ప్రొడ్యూసర్ బొమ్మాలి రవిశంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రయణ్య’. అయితే ఈ సినిమాతో రవిశంకర్ కుమారుడు అద్వయ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో.. తాజాగా, సుబ్రమణ్య గ్లింప్స్ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను వదిలారు. సెప్టెంబర్ 16న ఉదయం 11:11 గంటలకు లాంచ్ కాబోతున్నట్లు వెల్లడించారు. కాగా, షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read More..

Mathu Vadalara-2: ‘మత్తు వదలరా- 2’ పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ.. ఏమన్నారంటే?

Advertisement

Next Story

Most Viewed