- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘డార్లింగ్’ తెచ్చిన తంటా.. ప్రియదర్శిని పిచ్చికొట్టుడు కొట్టిన టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్ (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్‌కు ఒకానొక సమయంలో యాక్సిడెంట్ కావడంతో పూర్తిగా సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇటీవల స్వయంభు సెట్‌లో అడుగుపెట్టి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే గత రెండు రోజుల నుంచి నభా నటేష్‌కు, బలగం నటుడు ప్రియదర్శికి సోషల్ మీడియా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి డార్లింగ్ అనడంతో ఈ అమ్మడు మిస్టర్ మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా రితూ వర్మ పెట్టిన పోస్టులో కూడా వీరిద్దరి వార్ కొనసాగింది.
కానీ ఆమె మీ ఇద్దరి లొల్లి ఏందని ఫైర్ కావడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఈ వార్‌కి నేడు ఎండ్ కార్డ్ వేశారు. ప్రియదర్శి, నభా నటేష్ కాంబోలో ‘డార్లింగ్ వై దిస్ కొలవెరి’ అనే సినిమా రాబోతున్నట్లు గ్లింప్స్ విడుదల అయ్యాయి. ఇందులో మొదట.. ప్రియదర్శి హెయిట్ చేయించుకోవడానికి సెలూన్‌కు వెళతాడు. అయితే కటింగ్ చేసే వ్యక్తిగా మహేష్ విట్టా ఉంటాడు. దీంతో హెయిర్ కట్ చేస్తా అని అంటే.. వద్దు నువ్వు మాలిష్ చేసి, హెడ్ మసాజ్ చేయమని అంటాడు.
దీంతో ఏమైందన్న సైకో లాగా ఉన్నావు అనగా.. ఆడవాళ్లు ఎలా ఉంటారో పాటల విధంగా వివరించినట్లు చూపించారు. ఆ తర్వాత ఆ పిల్లే పెళ్లాం అయితే ఏమైతదో కానీ మొగుడి తాట తీసి తందూరి వండుకుని తింటారు అని ప్రియదర్శి అంటాడు. ఇక ఇంటికి వచ్చాక నభా నటేష్ ఫుల్ గొడవ పడి కొట్టడానికి కూడా వెనకాడదు. అతని గల్లా పట్టుకుని మరీ తిడుతుంది. ప్రస్తుతం డార్లింగ్ సినిమా గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ పేరుతో రాబోతుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.