- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘భారీ ప్రవేశానికి అంతా సిద్ధమైంది’ నెట్టింట దుమారం రేపుతోన్న జూనియర్ సింహం మెకోవర్ వీడియో
దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ తనయుడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులు నుంచి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే నటసింహం నందమూరి బాలయ్య కూడా నా కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీకి రాబోతున్నారంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ హీరో చేసిన కామెంట్స్ నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిల్ ఇచ్చాయి.
తాజాగా మోక్షజ్ఞ ఓ స్పెషల్ ఫొటో షూట్ వీడియోను ‘భారీ ప్రవేశానికి అంతా సిద్ధమైంది’ అనే క్యాప్షన్ రాసుకొచ్చి బాలయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్‌లో కనిపించి అభిమానులకు పిచ్చేక్కిస్తున్నాడు.కాస్త బొద్దుగా ఈయన ఇప్పుడు పూర్తిగా హీరో లుక్‌లోకి మారిపోయాడని, యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడంటూ మోక్షజ్ఞ మేకోవర్ చూసి స్టన్ అవుతున్నారు. జూనియర్ సింహం ఎంట్రీ అదిరిపోవాల్సిందే అంటూ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా చేయనున్నాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ పూర్తి చేశాడని నెట్టింట టాక్ వస్తుంది. అలాగే ఈ మూవీలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నారట.ఈయన చిన్న కుమార్తె తేజస్వినీ ఈ మూవీని నిర్మిస్తున్నారట.