ఈమె నటనకు రాజమౌళి కూడా ఫిదా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటో?

by Prasanna |   ( Updated:2024-04-22 04:09:19.0  )
ఈమె నటనకు రాజమౌళి కూడా ఫిదా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటో?
X

దిశ, సినిమా: తీసింది ఒక్క సినిమానే కానీ.. సౌత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఎక్కడా చూసిన ఈమె గురించే చెప్పుకుంటున్నారు. ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ప్రేమలు సినిమాలో హీరోయిన్ మలయాళ కుట్టి మమితా బైజు. తాజాగా, ఈ ముద్దుగుమ్మ చిన్న నాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అందుకుంది. అలాగే.. ఈ సినిమా తర్వాత తెలుగు అబ్బాయిలు ఈ అమ్మాయికి హారతి ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళిని కూడా ఆమె నటన మెప్పించింది. యువతకు ఇష్టమైన హీరోయిన్‌ గా మారిపోయింది.

మమిత చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫోటో పైనే ఉంది. ఈ ఫొటోలో మమిత తన సోదరుడితో కలిసి నిలబడి ఉంది. మమిత 2017లో విడుదలైన సర్వోపరి పాలక్కారన్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హనీ బీ 2, డాకిని, వరతన్, యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ, వికృతి, ఆపరేషన్ జావా, వయ, సూపర్ శరణ్య , ప్రణయవిలాసం వంటి చిత్రాలతో అలరించింది. దీని తర్వాత ప్రేమలు సినిమా ద్వారా సౌత్ ఇండియాలో మమిత ఫేమ్ పెరిగింది. తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఆమె ఓ చిత్రంలో నటించనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Advertisement

Next Story