- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 ఏళ్లు వచ్చినా సరే.. షారుఖ్‌తో రోమాన్స్ చేస్తానంటున్న స్టార్ హీరోయిన్..
దిశ, వెబ్‌డెస్క్: షారుఖ్ ఖాన్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ‘‘కుచ్ కుచ్ హోతా హై, చల్తే చల్తే, పహేలీ, కభీ అల్విదా నా కెహ్నా’’ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. వీరు బాలీవుడ్ సినిమాల్లో మంచి జంటగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య ముందు నుంచే మంచి స్నేహ బంధం ఉండేది. షారుఖ్‌కు మాత్రం 60 ఏళ్లు దగ్గరగా వస్తున్నా ఆయన సిక్స్‌బాక్‌తో అమ్మాయిల హృదయాలు దోచేసుకుంటున్నాడు. ఇటీవలే రాణి ముఖర్జీ ‘‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.
దీంతో షారుఖ్.. రాణి ముఖర్జీనీ అలాగే, టీమ్ బృందాన్ని అభినందిస్తూ.. ట్వీట్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్‌లో మీడియా వారు, షారుఖ్ ప్రస్తావన తీసుకురాగా.. ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ నేను రైటర్స్‌కు ఇప్పుడే చెప్తున్నాను, మంచి ప్రేమ కథను నాకు షారుఖ్ కోసం రాయండి. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అతనితో సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే.. నాకు 80 ఏండ్లు వచ్చినా కూడా షారుఖ్ తో రొమాన్స్ చేయడానికి, లవ్ స్టోరీలు చేయడానికి నేను రెడీనే.. అంటూ రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లు ప్రస్తుతం బాలీవుడ్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.