- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తగ్గానంతే.. కానీ, ఓడిపోలే: సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేది. కానీ, ఇటీవల కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకు ఆమె దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో పలురకాల పుకార్లు వినిపించాయి. సమంత అనారోగ్యానికి గురైందని, చికిత్స కోసం అమెరికా పోయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అయినా వాటిపై సమంత స్పందించలేదు. తాజాగా, ఓ ఆసక్తికర పోస్టు చేసింది. శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెట్ డాగ్ ఫొటోను షేర్ చేసింది. ''వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు'' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో అది చూసి పలువురు సీని ప్రముఖులతోపాటు అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించే ఆ పోస్ట్ పెట్టిందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : 'రా ఏజెంట్‌గా' కనిపించనున్న సమంత.. !
Next Story