వరుస ఫ్లాపులు వచ్చినా తగ్గని రేంజ్.. ‘సలార్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగాల్సిందే?

by sudharani |   ( Updated:2023-12-21 14:50:05.0  )
వరుస ఫ్లాపులు వచ్చినా తగ్గని రేంజ్.. ‘సలార్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే గుండె ఆగాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ‘సలార్’ రికార్డ్ సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

‘సలార్’ మూవీకి గాను ప్రభాస్‌కు హోంబలే ఫిలింస్ రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కూడా సినిమా మొత్తం ఉండటంతో పాటు హీరో పాత్రకు సమానంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే పృథ్వీరాజ్‌కు రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే రిలీజైన షారుక్ ఖాన్ ‘డంకీ’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక రేపు ‘సలార్’ రిలీజ్ ఉండగా.. బాక్సాఫీస్ వార్ ఈ రెండు సినిమాల మధ్య కొనసాగుతుందని, ఎవరిది పై చేయి అవుతుందో చెప్పడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.+


సలార్ టికెట్స్ ధర ఎంతో తెలుసా..? రెబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!

Advertisement

Next Story