ప్రేమించినవాడికే అక్కగా నటించమన్నారు.. తట్టుకోలేకపోయా

by Hamsa |
ప్రేమించినవాడికే అక్కగా నటించమన్నారు.. తట్టుకోలేకపోయా
X

దిశ, సినిమా: ‘భాగ్ మిల్కా భాగ్‌’ను మొదట తిరస్కరించడానికి గల కారణాన్ని బయటపెట్టింది దివ్య దత్తా. నిజానికి తనకు ఫర్హాన్ అక్తర్‌పై విపరీతమైన ప్రేమ ఉందన్న నటి.. మనసులో అంత క్రష్ పెట్టుకుని తనకు అక్కగా నటించేందుకు మనసు ఒప్పుకోలేదని చెప్పింది. ‘ఈ సినిమాలో ఇష్రీ కౌర్ పాత్రకు ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్నా. అయితే ఫర్హాన్ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. అందుకే ఆయనకు సోదరిగా కనిపించాలంటే భయమేసింది. అప్పుడు దర్శకుడు రాకేష్ నా దగ్గరకు వచ్చి ‘నువ్వు నటివి. ప్రొఫెషనల్‌గా ఆలోచించాలి. ఇది నిజ జీవితం కాదు’ అని చెప్పి ఒప్పించడంతో నా మనసు మార్చుకున్నా’ అని చెప్పింది. అలాగే మొదట షూటింగ్ కోసం సెట్‌కి వచ్చినప్పుడు ఫర్హాన్‌ను గుర్తించలేకపోయానన్న నటి.. అతడు మేకప్‌లో మిల్కా సింగ్ లాగే కనిపించాడంటూ ప్రశంసలు కురిపించింది.

Advertisement

Next Story