ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేసిన ‘సలార్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్

by Dishaweb |   ( Updated:2023-05-22 10:46:17.0  )
ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేసిన ‘సలార్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్
X

దిశ, సినిమా : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఆధ్యాత్మిక చిత్రం కాగా ఆ తర్వాత రానున్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సలార్’పైనే అధికంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు అభిమానులు. స్పిరిచ్యువల్ మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్ చూశాక ఎలాగూ సక్సెస్ అవుతుందనే నమ్మకానికి వచ్చిన ఫ్యాన్స్.. ప్రజెంట్ ‘సలార్’ అప్‌డేట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో సినిమా ప్రకటించినప్పుడు వచ్చిన అప్‌డేట్ తప్ప తర్వాత ఎలాంటి న్యూస్ లేకపోవడంపై నిరాశతో ఉన్నారు. తరచూ పోస్టర్, గ్లింప్స్ అంటూ అడుగుతూనే ఉన్నారు. దీంతో కాన్‌స్టాంట్ అప్‌డేట్స్‌ డిమాండ్‌ను తట్టుకోలేని డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ ట్విట్టర్ ఎకౌంట్ డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

Read More: బ్యాంకు వాళ్లు నా ఇల్లు జప్తు చేశారు : దర్శకుడు తేజ

Advertisement

Next Story