" Dhamaka" సినిమా ట్విట్టర్ రివ్యూ

by Prasanna |   ( Updated:2022-12-23 05:25:10.0  )
 Dhamaka సినిమా ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా " ధమాకా " . ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటించింది. ఈ సినిమాని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ పిక్చర్స్' పతాకంపై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ధమాకా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు. వారి చెప్పిన దాని బట్టి చుస్తే..సినిమా అవుట్ ఫుట్ బావుంది. ఈ సారి రవి తేజ హిట్టు కొట్టడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. అంతక ముందు వచ్చిన రెండు సినిమాల కన్నా ఈ సినిమా బావుందని రవితేజాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 'ఖిలాడి' , 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టులేకపొయాయి. రవితేజ మాస్ పెర్ఫార్మన్స్, శ్రీలీల నటన భీమ్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. కాకపొతే ఈ కథ రొటీన్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం లేకపోలేదు.


Also Read....

"Avatar 2 " సినిమా 6 డేస్ కలెక్షన్స్ !

Advertisement

Next Story