ఆర్జీవీ ‘శారీ’ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్

by Hamsa |   ( Updated:2024-09-14 14:11:51.0  )
ఆర్జీవీ ‘శారీ’ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గత కొద్ది రోజుల నుంచి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ప్రజెంట్ శారీ అనే మూవీ చేస్తున్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ అమ్మాయిని చూసి ఆమె అడ్రస్ తెలుసుకుని మరీ హీరోయిన్‌గా చాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా అప్డేట్స్ మాత్రం విడుదల కాలేదు. అయితే సోషల్ మీడియాలో శారీ సినిమా గురించి పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. సెప్టెంబర్ 15న 11 గంటలకు శారీ టీజర్ విడుదల కాబోతుంది. అయితే నేనొక విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ సినిమా ఉత్తరప్రదేశ్‌లోని శారీ కిల్లర్‌కి సంబంధించిన కథ కాదు. కాకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో కుర్చీపై ఓ మహిళ కూర్చొని ఉండగా.. ఓ వ్యక్తి ముఖమంతా రక్తం కారుతూ కనిపించాడు. ప్రజెంట్ ఈ పిక్ అంచనాలను పెంచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed