ప్రముఖ దర్శకుడిపై మనసు పడిన కలర్స్ స్వాతి..

by Anjali |   ( Updated:2023-10-10 15:43:44.0  )
ప్రముఖ దర్శకుడిపై మనసు పడిన కలర్స్ స్వాతి..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇందులో భాగంగా తాజాగా సుమ యాంకరింగ్ చేస్తున్న ‘సుమ అడ్డా’ అనే టీవీ షోలో పాల్గొంది మూవీ టీం. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. హీరో నవీన్, స్వాతి.. సుమతో కలిసి సందడి చేశారు. ఇక ఈ షోకు ‘క్షణం’ సినిమా డైరెక్టర్ రవికాంత్ కూడా హాజరయ్యాడు. అయితే ఇందులో స్వాతి తనకు దర్శకుడు రవికాంత్‌పైన ఎప్పటి నుంచో క్రష్ ఉందని .. ‘నాకు రవికాంత్ కావాలి’ అని చెప్పేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story