- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే.. ఇన్నాళ్లకు వచ్చిన క్లారిటీ?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ చెయ్యగా.. ‘పుష్ప-2’ కోసం అందరూ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రతి స్టార్ హీరో.. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేసి అప్‌డేట్స్ ఇచ్చే్స్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2’ తర్వాత చేసే ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించినా.. డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ కూడా ప్రచారంలోకి రావడంతో ఈ రెండిటిలో ఏ సినిమా ముందు పట్టాలు ఎక్కుతుందా అని సందిగ్దంలో పడ్డారు ఫ్యాన్స్. అయితే.. దీనిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది. దీని కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నట్లు టాక్. అయితే.. ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ సినిమాలు రాగా అవి సక్సెస్‌ను అందుకున్నాయి.
Read More..
Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర నుంచి మరో ట్రైలర్?