- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చిన చిరంజీవి.. పుట్టిన రోజున సంచలన నిర్ణయం.. బాధలో ఫ్యాన్స్?
దిశ, సినిమా: దాదాపు 150 కు పైగా చిత్రాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరో కేవలం రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గొప్పమనసు చాటుకుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి నేడు రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ హీరోగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. చిరు మంచితనంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మెగాస్టార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి ఏటా చిరంజీవి ఆగస్టు 22 వ తేదీన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ కూడా మెగాస్టార్ పుట్టిన రోజున కేక్ కటింగ్స్ చేసి హంగామా చేస్తారు. కానీ ఈ సంవత్సవం చిరు.. అభిమానుకు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో ఇటీవలే కేరళ వెళ్లి వయనాడ్ బాధితులకు ఆర్థిక సాయంగా కోటి రూపాయల సాయం చేసిన విషయం తెలిసిందే.
కాగా అక్కడి పరిస్థితులు చూశాక చిరు మనసు చలించిపోవడంతో.. సాటి మనుషులు కష్టాల్లో ఉంటే సంబరంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని చిరు అంటున్నారట. దీంతో ఈ ఏడాది మెగాస్టార్ బర్త్ డే కు ఫ్యాన్స్ ఎటువంటి హడావుడి చేయొద్దని కోరారట.అలాగే రక్తదాన శిబిరాలకు అన్నదానం చేయాలని చెప్పారట. చిరంజీవి నిర్ణయానికి అభిమానులు నిరాశ చెందగా.. మరోవైపు గొప్పగా ఆలోచించారని కొనియాడుతున్నారు.