- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరు మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇవ్వని ఏకైక వ్యక్తి.. ఎవరో తెలుసా?
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి కలిసి ఫోటో దిగే అవకాశం వస్తే బాగుండు.. ఈ జన్మకి ఇది చాలని తరించిపోయే వాళ్లు ఉన్నారు. కనీసం అయనను దూరం నుంచి చూసినా చాలనుకుంటారు. అలాంటి వ్యక్తి ఎవరికైనా పుట్టిన రోజు నాడు విషెస్ చెబుతూ మెసేజ్ వస్తే ఆనందానికి అవధులు ఉండవు. కానీ, ఒక టాలీవుడ్ యాంకర్ మాత్రం చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే పట్టించుకోలేదట. ఈ విషయాన్ని ఒక టాక్ షోలో తెలిపాడు చిరు. ఆ యాంకర్ ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సుమ. ఇటివల సుమ హోస్ట్‌గా 'సుమ అడ్డ' అని ఓ టాక్ షోను ప్రారంభించింది. ఈ షోలో భాగంగా గెస్ట్‌గా చిరంజీవి హాజరై సందడి చేశాడు. 'నాలుగు సంవత్సరాల నుంచి హ్యాపీ బర్త్ డే సుమ గాడ్ బ్లెస్ యు, స్టే బ్లెస్' మెసేజ్‌లు పెడుతున్నా నువ్వు రిప్లై పెట్టలేదు. చిరంజీవి స్వయంగా మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇవ్వని ఏకైక వ్యక్తి నువ్వే' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కంగుతిన్న సుమ 'సార్ నిజంగా మీ నెంబర్ నాకు తెలియదు. ఎవరో మెసేజ్ చేశారు అనుకున్నా. మీరు మెసేజ్ చేస్తారని కూడా ఊహించలేదు సారీ సార్ ' అని చెప్పింది.
Also Read...
'వాల్తేరు వీరయ్య'.. సమిష్టి కృషితోనే గొప్ప విజయం సాధించింది: చిరు