డబ్బుకోసం నేనెప్పుడూ దిగజారిపోలేదు.. Charmy Kaur ఎమోషనల్

by Hamsa |   ( Updated:2022-08-18 07:50:30.0  )
డబ్బుకోసం నేనెప్పుడూ దిగజారిపోలేదు.. Charmy Kaur ఎమోషనల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి చార్మీ కౌర్ కెరీర్ అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం తాను నిర్మాతగా తెరకెక్కించిన 'లైగర్' ప్రమెషన్స్‌లో పాల్గొంటున్న నటి.. చేతిలో రూపాయి లేకుండా గడిపిన రోజులను తలచుకుని కన్నీరు పెట్టుకుంది. ఈ మేరకు నిర్మాణంపై ఉన్న ఆసక్తితో పలు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినప్పటికీ ఒప్పుకోలేదని తెలిపింది. అయితే అదే సమయంలో కరోనా కారణంగా లౌక్ డౌన్ విధించడంతో చేతిలో పని, డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని భావోద్వేగానికి లోనైంది.

ఈ క్రమంలో ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయన్న ఆమె.. డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మనసుకు నచ్చని పనులు చేయనని వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. ఇక విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వస్తున్న 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story