- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Chandramukhi 2 : ఆలస్యానికి కారణం చెప్పిన డైరెక్టర్.. సిల్లీ రీజన్స్ చెప్పొద్దంటున్న నెటిజన్స్..
దిశ, సినిమా: 2003లో విడుదలైన ‘చంద్రముఖి’ మూవీ ఎలాంటి విజయం సొంతం చేసుకుంది మనకు తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ కూడా తెరకెక్కింది. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాఘవ లారెన్స్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించబోతుంది. ఇక వినాయక చవితి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా నెలాఖరుకి వాయిదా పడింది. దీంతో ఆడియన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ ఉందనే కారణంతోనే వాయిదా వేశారనే విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న దర్శకుడు పి వాసు.. ఇందుకు గల కారణాన్ని బయటపెట్టాడు. ‘సినిమా మొత్తం రెడీ చేసి 15వ తేదీ రిలీజ్ అని అనౌన్స్ చేశాం.
కానీ మూవీకి సంబంధించిన 480 ఫైల్స్ కనిపించలేదని.. ఒకరాత్రి నాకు ఎడిట్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. మా సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ఏకంగా 400కుపైగా షాట్స్ మిస్ అయ్యాయి. మళ్లీ వాటిని ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేసి రెడీ చేయడానికి సమయం పట్టింది. అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. కానీ ‘సినిమా విషయంలో ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరుగుతుంది.. అసలు నమ్మేలా లేదు’ అంటున్నారు నెటిజన్స్.
480 shots of footage from the film got deleted/missed just a week before the release, this is the reason for delaying #Chandramukhi2 release for a couple of weeks but not because of the clash with another big film, says the director. Is the reason believable? What say? pic.twitter.com/ky8xjIgzKW
— Aakashavaani (@TheAakashavaani) September 24, 2023