Bhagyashree Borse: కేవలం ఇప్పుడే మొదలైంది.. ఇంట్రెస్టింగ్‌గా హీరోయిన్ పోస్ట్

by sudharani |   ( Updated:2024-08-27 15:25:05.0  )
Bhagyashree Borse: కేవలం ఇప్పుడే మొదలైంది.. ఇంట్రెస్టింగ్‌గా హీరోయిన్ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. మాస్ రాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. మూవీ ప్రమోషన్స్ టైంలో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో సందడి చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా సక్సెస్ కాలేకపోయింది. అయితే.. మూవీ హిట్టా.. ఫట్టా అనేది పక్కన పెడితే.. భాగశ్రీ బోర్సేకు మాత్రం తెలుగులో బాగానే ఫాలోయింగ్ పెరిగింది.

ఈ క్రమంలోనే ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ.. ‘మీ అమ్మాయిపై మీరంతా చూపిస్తున్న ప్రేమ ఊహించలేనిది. నా ప్రయాణం కేవలం ఇప్పుడే మొదలైంది. నా నెక్ట్స్ చాప్టర్‌ను మీతో పంచుకునేందుకు వేచి ఉండలేకపోతున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె పోస్ట్ వైరల్ కావడంతో.. సక్సెస్‌ఫుల్ జర్నీ సాగించాలంటే హిట్టు, ప్లాపులను పక్కన పెట్టాలని అప్పుడే తెలుసుకుంది భాగ్రశ్రీ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story