‘#NBK 108’.. షూట్‌లోకి ఫన్నీగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ

by Anjali |   ( Updated:2023-05-11 06:31:18.0  )
‘#NBK 108’.. షూట్‌లోకి ఫన్నీగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం ‘#NBK 108’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న మూవీలో నటీనటుల షూటింగ్ ఎంట్రీలు స్పెషల్‌గా చూపిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ రిలీజ్ చేయగా తాజాగా మరో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యాడు. ‘డైరెక్టర్‌గారు మేము కూడా ఆన్ బోర్డు.. నాకు లేదు వెల్కమ్’ అంటూ ఫన్నీగా చెప్పాడు. దీంతో ‘ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే.. మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్‌లో ఉంటారు. మళ్లీ మీకు సెపరేట్‌గా ఈ వీడియోలు అవసరమా బ్రహ్మాజీ గారు’ అంటూ దర్శకుడు నవ్వుతూ రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story