నిజమే.. రష్మికను ప్రేమిస్తున్నా.. అమె నా క్రష్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరో

by Sujitha Rachapalli |
నిజమే.. రష్మికను ప్రేమిస్తున్నా.. అమె నా క్రష్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో జిబ్రాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ' కభీ ఖుషి కభీ గమ్ ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆయన... 'ఇష్క్ విష్క్ రీబౌండ్ 'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా చాలా రోజులుగా రష్మిక అంటే ఇష్టమని ఈ యంగ్ బాయ్ చెప్తున్నట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని చెప్పాడు. ' రష్మిక అంటే నాకు లవ్. క్రష్. తెరమీద తనను చూడగానే చాలా హ్యాపీగా ఉంటుంది. క్యూట్ గర్ల్. అంత అందాన్ని ఇంతకు ముందు చూడలేదు. మై శ్రీవల్లి ' అంటూ సిగ్గు పడిపోయాడు.

కాగా రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ బిగ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందనడంలో సందేహం లేదంటున్నారు ఆమె అభిమానులు. ఇందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని చెప్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప 2 తోపాటు మరో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed