‘పుష్ప 2’ నుండి బిగ్ అప్‌డేట్..

by Kavitha |   ( Updated:2024-01-31 15:06:06.0  )
‘పుష్ప 2’ నుండి బిగ్ అప్‌డేట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాలో ‘పుష2 ’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో గ్యాప్ లేకుండా షూటింగ్ ముగించుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ సీక్వెల్ విడుదల పై వాయిదా పడింది అంటూ ఇప్పటికే చాలా రకాల వార్తలు వినిపించగా. తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. సోమవారం (జనవరి 29) ఓ ట్వీట్ ద్వారా లీజ్ వాయిదా పడబోదని మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. అలాగే ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు

కాగా ఈ పోస్టర్ లో ‘పుష్ప రాజ్ తన రూల్ ప్రారంభించడానికి మరో 200 రోజులే ఉంది. ‘పుష్ప 2 ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15న ఘనంగా రిలీజ్ కాబోతోంది’ అంటూ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్ లను ట్యాగ్ చేశారు. ఇక మేకర్స్ ఇచ్చిన ఈ హామీతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మొదటి ‘పుష్ప’ హైప్ ను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ సుకుమార్ ఈ సిక్వెల్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతోపాటు రీషూట్ల మీద రీషూట్లు చేస్తున్నాడు. అందుకే అటు టైమ్ తో పాటు, ఇటు బడ్జెట్ కూడా పెరిగిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed