- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiranjeevi నిర్మాతలకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో మూడు కేసులు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. గత నెలలో విడుదైన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కోట్లల్లో నష్టపోయారు. దాదాపుగా యాభై కోట్లకుపైగానే నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా డిజాస్టర్ కాగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టారు. వీరితోపాటు మరి కొందరు కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(సతీష్) తనని నిర్మాతలు మోసం చేశారని హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో చీటింగ్ కేసు వేశారు.
కేసు వేసిన అనంతరం డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారు. ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం రూ.30 కోట్లు వైట్ అమౌంట్‌ను బ్యాంకు నుంచి తాను చెల్లించాను. కానీ తనకు కేవలం విశాఖపట్నం హక్కులను మాత్రమే ఇచ్చారు. దీని గురించి నిర్మాతలను కలిసినప్పుడు ‘భోళా శంకర్’ సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారు. ఇక ఇండస్ట్రీతో తనకున్న అనుబంధంతో ఇన్నాళ్లు ఫోర్స్ చేయలేదు. కానీ కనీసం తనతో వాళ్లు మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేనందునే తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాను’’. అని తెలిపారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్‌ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్‌పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని సతీష్ అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి : Salaar OTT Rights : ఊహించని రేటుకు 'సలార్' ఓటీటీ హక్కులు..!