విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ ట్రైలర్.!

by Prasanna |   ( Updated:2024-06-02 16:31:28.0  )
విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ ట్రైలర్.!
X

దిశ, సినిమా: కొన్ని చిత్రాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించింది. మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టి అప్పట్లో అదరగొట్టింది. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ పార్ట్1 లో చూపించిన విధంగా ఎమోషనల్ సీన్స్‌తో.. హీరో విజయ్ ఆంటోనీ పెద్ద బిజినెస్ మెన్‌గా, అదే టైంలో బిచ్చగాడిగా కనిపిస్తున్నాడు. మొత్తానికి గ్రాండ్ విజువల్స్‌తో పాటుగా నేచురాలిటీకి తగ్గ విజువల్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed