సేమ్ సెక్స్ మ్యారేజ్ న్యాయమైనదే.. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు

by Anjali |   ( Updated:2023-05-09 12:56:12.0  )
సేమ్ సెక్స్ మ్యారేజ్ న్యాయమైనదే.. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు
X

దిశ, సినిమా: భారతదేశంలో సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు పూర్తి మద్దతు తెలిపింది భూమి పెడ్నేకర్. 2022లో వచ్చిన ‘బదాయి దో’లో నటించిన లెస్బియన్‌ పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న నటి.. ప్రస్తుతం సుప్రీం కోర్టులో జరుగుతున్న స్వలింగ వివాహం చర్చపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ మేరకు తనను తాను స్వలింగ సమాజానికి ఆప్తమిత్రురాలిగా పేర్కొన్న నటి.. వారి జీవితాలపై సమాజంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని చెప్పింది.

ఈ ప్రపంచం అందరికీ న్యాయమైన, సమానమైన ప్రదేశంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రేమ మనందరి జీవితంలోనూ సమానంగా ఉండాలి. దేవుడు మనల్ని ఒకే థ్రెడ్ నుంచి సృష్టించాడని భావిస్తున్నా. ఒక సంఘానికి మిత్రురాలిగా దీనిపై తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే LGBTQIA+ కమ్యూనిటీలో నాకు చాలా మంది స్నేహితులున్నారు. ఒక చిన్న మార్గంలో వారి తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందాను. వారి సవాళ్ల పరిష్కారంలో నేనూ భాగమని భావిస్తున్నా’ అని చెప్పింది.

Also Read..

లేడీ సింగర్‌తో నటి శృంగారం.. చాలా విషయాలు నేర్చుకుందట

Advertisement

Next Story