Becarefull: టాయిలెట్‌లో మొబైల్ వాడుతున్నారా?

by Anjali |   ( Updated:2023-04-18 15:31:04.0  )
Becarefull: టాయిలెట్‌లో మొబైల్ వాడుతున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఫోన్లల్లో మునిగి తెలుతున్నారు. మానవ జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఇటీవల ఫోన్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్ చేసుకొని మరణించిన వార్తలు కూడా వినే ఉంటారు. చివరకు చిన్నపిల్లలు ఫుడ్ తినాలన్నా, నిద్రపోవాలన్నా, చెప్పింది వినాలన్నా తప్పకుండా మొబైల్ ఇవ్వాల్సిందే. అయితే కొంతమంది టాయిలెట్‌లోకి కూడా మొబైల్ తీసుకెళ్లి ఎక్కువ సమయం పాటు బాత్రూమ్‌లోనే గడుపుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అనారోగ్యానికీ గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల కలిగే వ్యాధులేంటో చూద్దామా..

* టాయిలెట్‌లో ఎక్కువ సేపు మొబైల్‌తో గడపడం వల్ల డయేరియా వ్యాధి సోకుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వాంతులు, విరేచనాలు వస్తాయి. ఫోన్ స్క్రీన్ ద్వారా శరీరంలోకి చెడు బ్యాక్టీరియా చేరి.. మీ ఆరోగ్యానికీ పూర్తిగా నాశనం చేస్తుంది. దీంతో మీరు బలహీనంగా మారతారు.

* టాయిలెట్‌లలో కామన్‌గా మన శరీరానికీ హాని కలిగించే బ్యాక్టీరియా ఎప్పటికీ ఉంటుంది. టాయిలెట్ ఉపయోగించిన అనంతరం చేతులు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఫోన్ తీసుకెళ్తే బయటకు వచ్చిన తర్వాత దానిని శానిటైజ్ చేయాలి. ఒకవేళ చేయకుండా అలాగే వాడితే ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. దీంతో హెల్తే కాదు చర్మవ్యాధులు కూడా వస్తాయి.

* టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. బాత్రూమ్‌లో చాలా సమయం పాటు ఫోన్‌ను వాడుతూ ఉండడం వల్ల పాదాలు కూడా మొద్దుబారతాయి.

* ఇది పురీషనాళంపై ఒత్తిడిని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story