Bigg Boss - Barrelakka : బిగ్ బాస్ హౌజ్‌లోకి బర్రెలక్క.. లిస్ట్ రివీల్

by Sujitha Rachapalli |
Bigg Boss - Barrelakka : బిగ్ బాస్ హౌజ్‌లోకి బర్రెలక్క.. లిస్ట్ రివీల్
X

దిశ, సినిమా: తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదలుకాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోతో హోస్ట్ నాగార్జున అదరగొట్టాడు. టన్నుల కొద్దీ ఎంటర్టెన్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పేశాడు. లాస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కాగా ఈ సీజన్ మరింత ఉత్కంఠగా ఉండబోతుందనే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అభిమానుల్లో ఇంతకీ కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ తో ఉండగా.. ఈ రియాలిటీ షో సభ్యుల లిస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

కాగా ఇందులో సామాన్య జనం నుంచి బర్రెలక్క బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు టాక్. గత సీజన్ లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. ఈసారి బర్రెలక్క(సిరి) విన్నర్ అవుతుందని ఇప్పటికే కొందరు సపోర్ట్ కూడా మొదలుపెట్టేశారు. కాగా ఈమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. కాగా నిరుద్యోగులు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే బదులు బర్రెలు కాసుకోవడం బెటర్ అనే వీడియోతో పాపులర్ అయింది ఈ బర్రెలక్క.

Next Story

Most Viewed