మళ్లీ అవే ముఖాలు.. కేరళ స్టోరీపై కుట్ర చేస్తున్నాయి: అనుపమ్ ఖేర్

by Prasanna |   ( Updated:2023-05-09 07:36:39.0  )
మళ్లీ అవే ముఖాలు.. కేరళ స్టోరీపై కుట్ర చేస్తున్నాయి: అనుపమ్ ఖేర్
X

దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కొనసాగుతున్న వివాదంపై అనుపమ్ ఖేర్ విరుచుకుపడ్డాడు. అప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ను వ్యతిరేకించిన వ్యక్తులే ఇప్పుడు ఈ మూవీని టార్గెట్ చేశారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంకా కేరళ స్టోరీ చూడలేదు. అయితే కశ్మీర్ ఫైల్స్‌ను టార్గెట్ చేసిన ముఖాలే సుదీప్తో సేన్ చిత్రాన్ని వివాదాస్పదం చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. నేను ఆ ముఖాలను చూశాను. ఏదేమైనా వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు తీస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఒకరకమైన ప్రచారం అని భావించే వారు.. తమకు పరిపూర్ణంగా అనిపించే సబ్జెక్ట్‌తో వస్తే ఫ్రీగా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి భావాలున్న వారిని ఎవరూ ఆపడం లేదు’ అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు.

Read more:

బాలయ్య కోసం కథ సిద్ధం చేసిన ‘బలగం’ డైరెక్టర్ వేణు

Advertisement

Next Story