Rishi Sunak పై ప్రశంసల వర్షం కురిపించిన Anupam Kher.. ఏదైనా జరగొచ్చంటూ..

by sudharani |   ( Updated:2022-10-26 11:26:31.0  )
Rishi Sunak పై ప్రశంసల వర్షం కురిపించిన Anupam Kher.. ఏదైనా జరగొచ్చంటూ..
X

దిశ, సినిమా : 'కార్తికేయ 2' ఫేమ్, బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ భారత సంతతికి చెందిన మొదటి UK PM రిషి సునక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIతో రిషి షేక్ హ్యాండ్‌‌కు సంబంధించిన ఫొటోతోపాటు ఆయన భార్యా పిల్లలతో కలిసి ఉన్న పిక్, జనాలను ఉద్దేశిస్తూ హాయ్ చెప్తున్న ఫొటో షేర్ చేసిన అనుపమ్.. 'రిషి సునక్ హిందువు, ముస్లిం, సిక్కు లేదా క్రైస్తవుడు ఏ మతస్థుడు అనేది ప్రశ్న కాదు. 75ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయం. 200 సంవత్సరాలు మనల్ని పాలించిన ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం విశేషం. ప్రతి భారతీయుడు ఈ విజయాన్ని జరుపుకోవాలి. జై హింద్. ఏదైనా జరగవచ్చు. #Indian, #PrimeMinister' అంటూ పోస్ట్ పెట్టాడు.

Next Story

Most Viewed