Aadikeshava : వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’ నుంచి మరో సాంగ్ రిలీజ్..

by sudharani |   ( Updated:2023-10-14 14:13:17.0  )
Aadikeshava : వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’ నుంచి మరో సాంగ్ రిలీజ్..
X

దిశ, సినిమా: మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా ‘హే బుజ్జి బంగారం’ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. కాగా ‘ఉప్పెన’ మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’, ‘అంగరంగ వైభవంగా’ డిజాస్టర్‌గా నిలిచాయి. మరీ ఈ చిత్రం‌తో అయినా మళ్లీ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

Next Story