- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాయణం తెలియకుండా సినిమా ఎలా తీశారు?.. ‘Adipurush’పై మరో వివాదం..
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రంపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో, అదే స్థాయిలో విమర్శలు, వివాదాలు కూడా ఎదురవుతున్నాయి. ఇక టీజర్ రిలీజ్ అయినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కాగా తాజాగా విడుదలైన మూవీ ట్రైలర్‌పై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. రామాయణంలో రాసినట్లుగా రావణుడు భూమితో సహా సీతమ్మను ఎత్తుకెళతాడు. ఇప్పటి వరకు వచ్చిన రామాయణ సినిమాల్లో కూడా అదే చూపించారు. ‘రామదాసు’ సినిమాలోనూ సేమ్ సీన్ ఉంది. ఇక పర్ణశాలలో రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిన జాడలు కూడా ఉన్నాయి. కానీ ‘ఆదిపురుష్’లో మాత్రం అలా కాకుండా రావణుడు తన మాయాజాలంతో సీతమ్మను తాళ్లతో బంధించి గాలిలోనే తీసుకెళ్లినట్టు చూపించారు. దీంతో నెటిజన్స్ దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు. ‘మీకు రామాయణం తెలుసా? స్టోరీ మార్చి తియడం కరెక్ట్ కాదు. అన్ని చూసుకోవాలి కదా’ అంటూ విమర్శిస్తున్నారు.
See More...