DOCTORS DAY: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యాంకర్ సుమ

by Sujitha Rachapalli |   ( Updated:1 July 2024 8:36 AM  )
DOCTORS DAY: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన యాంకర్ సుమ
X

దిశ, సినిమా: యాంకర్ సుమ అంత బిజీగా హీరోయిన్లు కూడా ఉండరేమో. అటు టీవీ షోస్ ఇటు ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్స్ అంటూ ఎప్పుడూ వర్క్ మోడ్ లోనే ఉంటుంది. ప్రతి ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫన్నీ వీడియోలు, తనకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో డాక్టర్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. వైద్యుల సేవలకు, వారి సహనానికి కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఈ వీడియోలో ఓ రోగి.. డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. తన బాధను చెప్పుకోవడంతో మందులు రాసిన వైద్యురాలు.. ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయమని చెప్తుంది. దీంతో రోగి అర్ధ రాత్రి తనకు ఫోన్ చేస్తుంది. ఏంటి ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అంటే లేదు రోజుకు రెండు సార్లు టాబ్లెట్ వేసుకోమన్నారు కదా అది పొద్దున, మధ్యాహ్నమా లేక మధ్యాహ్నం సాయంత్రమా లేక రాత్రి సాయంత్రమా లేక పొద్దున సాయంత్రమా అని అడుగుతుంది. దీంతో ఎలాంటి విసుగులేకుండా సమాధానం ఇస్తుంది డాక్టర్. జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. కాగా వీడియోలో పేషెంట్, డాక్టర్ రెండు పాత్రలు సుమ చేయడం విశేషం.

Next Story

Most Viewed