Chinmai Sripaada: చిన్నపిల్లవాడితో అనసూయ లిప్ కిస్.. సిగ్గు చేటు అంటూ చిన్మయి సెన్సేషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-07-28 01:45:30.0  )
Chinmai Sripaada: చిన్నపిల్లవాడితో అనసూయ లిప్ కిస్.. సిగ్గు చేటు అంటూ చిన్మయి సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఆమె కొన్ని మూవీస్‌లో సాంగ్ పాడటంతో పాటుగా సమంతకు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి మీటూ ఉద్యమం గురించి పోరాడుతుంది. వైరముత్తు మీద చిన్మయి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను కోలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అక్కడ పాటలు పాడేందుకు డబ్బింగ్ చెప్పేందుకు అనుమతి లేదు. దీంతో చిన్మయి ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ టీవీ షోలో భాగంగా అనసూయ చిన్న పిల్లాడితో ప్రవర్తించిన తీరుపై చిన్మయి ఫైర్ అయింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

అసలు విషయంలోకి వెళితే.. అనసూయ ఓ టీవీ షోలో భాగంగా చిన్న పిల్లాడిని ఎత్తుకుని తన మొహం మీద చూపించి ఇక్కడ ముద్దు పెట్టు అని చెంపల మీద లిప్స్ మీద కిస్ పెట్టించుకుంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై చిన్మయి ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయింది. అనసూయ పేరు పెట్టినప్పటికీ ఆమె ప్రవర్తించిన తీరుపై ఫైర్ అయింది. ‘‘తల్లిదండ్రులు, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నప్పుడు ఓ టీవీ షో హోస్ట్ పిల్లవాడిని నోటిపై ముద్దు పెట్టమని అడగడం నేను చూశాను. ఇది భయంకరంగా అనిపించింది.

చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఇలాంటి పనులు దగ్గరుండి చూస్తూ ఉండటం సరైనది కాదు. ఆ పిల్లాడు ముద్దులు పెడుతుంటే తల్లిదండ్రులు, ప్రేక్షకుల కేరింతలు, క్లాప్స్ కొడుతుండటం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. పిల్లలతో చేస్తున్న టీవీ, కామెడీ షోల్లో భయానకంగా ప్రవర్తిస్తున్నారు . పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలని కోరుకునే ఈ సమాజంలోనూ ఇవేవి యాక్సెప్ట్ చేసినట్టు కాదు’’ అని రాసుకొచ్చింది. కానీ అనసూయ పేరు మాత్రం పెట్టలేదు. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా అనసూయను ఉద్దేశించే పెట్టిందని డిసైడ్ అయిపోయారు. అంతేకాకుండా అలా ప్రవర్తించడం సిగ్గు చేటు అనే విధంగా పోస్ట్ ఉందని అభిప్రాయపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Read more...

Srimukhi : ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

(Video Link Credits to chinmayi sripaada Instagram Channel)

Advertisement

Next Story