ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయల ఆఫర్.. సుహాస్ షాకింగ్ కామెంట్స్

by Dishafeatures1 |
ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయల ఆఫర్..  సుహాస్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా తనని తాను నిరూపించుకుంటున్న నటుడు సుహాస్. రీసెంట్‌గా ‘అంబాజిపేట మ్యా్రేజీ బ్యాండు’ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ అనే మూవీ లో నటించాడు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఎన్నికల సమయం కదా మీ దాకా ఏమన్నా వచ్చిందా ఎలక్షన్ ఎఫెక్ట్ అని అడగ్గా సుహాస్ మాట్లాడుతూ.. ఓ రోజు మా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇలా ఓ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారా అని అడిగారట, అమౌంట్ కూడా భారీగానే ఇస్తామని చెప్పారంట. నాకు డౌట్ వచ్చి నన్నేనా అని అడిగాను. మిమ్మల్నే సార్ అని చెప్పాడు. నాకు మాములుగా సినిమా ఈవెంట్స్ లోనే మాట్లాడటం రాదు. ఇంకా ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతాను. ఒకవేళ నేను వెళ్లినా సరిగ్గా మాట్లాడటం రాని వాడ్ని తెచ్చుకున్నారని తిడతారు. ఆ ఆఫర్ కి నేను నో చెప్పాను అని తెలిపాడు.


భవిష్యత్తులో ఏమైనా పాలిటిక్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎవరికోసమైనా ప్రచారం చేసే ఛాన్స్ ఉందా అని అడగ్గా.. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన లేదు అని తెలిపాడు సుహాస్. అయితే సుహాస్ ని ప్రచారంలో పాల్గొంటే భారీగా డబ్బులు ఇస్తామని ఏ పార్టీ అడిగిందో మాత్రం చెప్పలేదు.





Next Story