సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. టాలీవుడ్ చరిత్రలోనే తొలి హీరోగా రికార్డ్

by Satheesh |   ( Updated:2023-10-17 13:51:37.0  )
సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. టాలీవుడ్ చరిత్రలోనే తొలి హీరోగా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకుని బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. కాగా, ఢిల్లీలో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ్ నటుడిగా స్టార్ హీరో అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము అల్లు అర్జున్‌కు ఈ అవార్డ్‌ను అందించారు. ఈ అవార్డ్ అందుకోవడం ద్వారా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తొలి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీతో పాటు మరికొందరు తెలుగు ఇండస్ట్రీ నుండి అవార్డ్‌లు అందుకున్నారు. పుష్ప సినిమాగానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్నారు. ఇక, జాతీయ ఉత్తమ నటీ అవార్డ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అందుకుంది. తమ అభిమాన నటుడు దేశ చలన చిత్ర రంగంలో అతి ముఖ్యమైన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed