- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెమ్యూనరేషన్‌లో రజనీకాంత్ ను దాటేసిన అల్లు అర్జున్
దిశ, సినిమా: గత రెండు దశాబ్దాలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆధిపత్యం కోసం ఎందరో హీరోలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు దాదాపు 74 ఏళ్లు వచ్చినా ప్రజల్లో క్రేజ్ ఒక్క అంగుళం కూడా తగ్గలేదు. చెప్పాలంటే ఇప్పటికీ కూడా రజని సినిమాకు వచ్చే వసూళ్లను నేటి తరం స్టార్ హీరోలు అందుకోలేకపోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘జైలర్’ చిత్రం ఇందుకు ఉదాహరణ. అందుకే ఆయనకు నిర్మాతలు ఒక్కో సినిమాకు రూ. 130 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. ఇప్పటి వరకు ఒక్క సౌత్ హీరో కూడా రజనీకాంత్ రెమ్యూనరేషన్ ని దాటలేకపోయారు. కాగా తాజా సమాచారం ప్రకారం మొట్టమొదటి సారిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాటేసాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనకు తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ లో బన్నీకి ఖాన్స్ తో సమానమైన ఫేమ్ వచ్చింది. ఆయనకు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నార్త్ ఇండియాలో మాత్రమే కాకుండా కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రజంట్ చేస్తున్న ‘పుష్ప ది రూల్’ కోసం లాభాల్లో 30 శాతం వాటా అడుగుతున్నాడట. అంటే రూ. 150 కోట్ల రూపాయలకు పైమాటే. దీంతో సౌత్‌లో రజనీకాంత్ రెమ్యూనరేషన్‌ని మించిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.