Allari Naresh: నరేష్‌లో అల్లరిని ఇక చూడలేమా?

by Prasanna |   ( Updated:2023-04-22 03:23:16.0  )
Allari Naresh: నరేష్‌లో అల్లరిని ఇక చూడలేమా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈవీవీ వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్. రవిబాబు డైరెక్ట్ చేసిన అల్లరి సినిమాతో హిట్ కొట్టిన నరేష్ తన పేరును తన పేరును అల్లరి నరేష్‌గా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి కామెడీ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్స్ లేక కామెడీ సినిమాలకు రెస్ట్ ఇచ్చి .. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన నాంది సినిమాలో అల్లరి నరేష్ సీరియస్ రోల్ చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అప్పటి నుంచి అలాంటి సినిమాలే చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో నాంది దర్శకుడితో మరోసారి ఉగ్రం అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల కాగా.. అందులో నరేష్ తన ఉగ్ర రూపం చూపించాడు. ఓ విధంగా చెప్పుకోవాలంటే నరేష్ లోని అల్లరిని ఇక చూడలేమని తెలుస్తుంది.

Advertisement

Next Story