బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే రొమాంటిక్ సాంగ్ చేసిన హీరోయిన్

by Dishaweb |   ( Updated:2023-10-10 15:44:24.0  )
బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే రొమాంటిక్ సాంగ్ చేసిన హీరోయిన్
X

దిశ, సినిమా : కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ఫిల్మ్ ట్రైలర్‌, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లవ్ అండ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ‘తుమ్ క్యా మిలే’ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్రమంలో ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన అలియా.. కూతురు రహ పుట్టిన తర్వాత చేసిన ఫస్ట్ సాంగ్ ఇదేనని, ఆమె జన్మించిన నాలుగు నెలల తర్వాత ఈ పాట షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది. కాగా ఇంత చిన్న గ్యాప్‌లో తన బాడీని కంఫర్ట్‌గా, సినిమాకు అనుగుణంగా మార్చుకోవడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా డెడికేషన్‌ను కొనియాడుతున్నారు.

Advertisement

Next Story