ఆ మూవీ నుంచి తప్పుకున్న Alia Bhatt.. !

by Anjali |   ( Updated:2023-08-24 14:54:11.0  )
alia bhatt
X

దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి త్వరలోనే రామాయణం ఆధారంగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అగ్ర దర్శకుడు నితీష్ తివారి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడిగా ‘కేజిఎఫ్’ హీరో యశ్ నటిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అలియా భట్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రతి చిన్న పాయింట్‌ను దగ్గరుండి చూసుకుంటుంది మూవీ యూనిట్. కానీ ఇదే టైమ్‌లో అలియాకు డేట్స్ కొరత ఉంది. ఇతర ప్రాజెక్ట్‌లకు సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు నో చెప్పేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

సల్మాన్ ఖాన్ సెక్సువల్ ఇంట్రెస్ట్‌పై హీరోయిన్ హాట్ కామెంట్స్

‘ఖుషి’ నాకు ఓ మధురమైన జ్ఞాపకం : విజయ్ దేవరకొండ

Advertisement

Next Story

Most Viewed