- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya-Sobhita నిశ్చితార్థంలో అఖిల్ షాకింగ్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటోస్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వారసుడిగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన ఆయన.. మనం మూవీలో గెస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలు మూవీస్ చేసిన ఆయన స్టార్‌గా మాత్రం పేరు సంపాదించుకోలేక పోయాడు. పెద్దగా హిట్స్ కూడా అందుకోలేదు. ముఖ్యంగా ఏజెంట్ చిత్రం కోసం చాలా కష్టపడినప్పటికీ కెరీర్‌లో డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో అఖిల్ గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. తర్వాత ఎలాంటి కొత్త సినిమా ప్రకటించలేదు.
కానీ అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు దీనిని యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, అక్కినేని నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంలో అఖిల్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 8న జరగ్గా దీనికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో అఖిల్ భుజాలు దాటేలా జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాడు. ప్రజెంట్ అక్కినేని ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అఖిల్ లుక్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.